పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హిందూ స్మశాన వాటిక లో నిద్రించారు. స్మశాన వాటిక ఆధునీకరణలో జరుగుతున్న ఆలస్యానికి వ్యతిరేకంగా తన నిరసనను వ్యక్తం చేయటానికీ, ఇంకా అక్కడ పనిచేయడానికి భయపడుతున్న వర్కర్లకు భరోసా కల్పించటానికి ఆయన ఈ పని చేసారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే అక్కడే తిని పడుకున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు తాను అక్కడే పడుకుంటానని ఆయన స్పష్టంచేశారు.
హిందూ స్మశాన వాటిక లో సరైన వసతులు లేకపోవటంతో ఆయన ఒక సంవత్సరం క్రితం 3 కోట్లు మంజూరు చేయించారు. స్మశానంలో పనికి కాంట్రాక్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో పనులు ఆలస్యమయ్యాయి. ఒక కాంట్రాక్టర్ ముందుకు వచ్చినప్పటికీ, వర్కర్లు అక్కడ పని చేయటానికి భయపడుతున్నారు. అక్కడ సగం కాలిన శవం లభ్యమవటంతో అది దయ్యాల పనే అని వర్కర్లు రావడం లేదు.
స్వయంగా ఎమ్మెల్యేనే అక్కడ పడుకోవటం తో అధికారులు, కాంట్రాక్టర్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు జరిపిస్తున్నారు. శనివారం రోజు 50 మంది వ్యక్తులు అక్కడ పనిచేయటం గమనార్హం.
Post a Comment