యాదాద్రి జిల్లా వలిగొండ సమీపంలోని వేములకొండలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారని ప్రాథమిక సమాచారం. ట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న మూసీ కాల్వలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష్య సాక్షులు చెబుతున్నారు. ట్రాక్టర్ లో 30 మంది మహిళా కూలీలు ఉన్నారు. చనిపోయిన వారిలో అత్యధికంగా మహిళలే. రోజువారీ కూలీ కోసం వీరు వెళుతుంటారు. ఇంతవరకు ఏడు మృత దేహాలను బయటకు తీసారు. మృతులను నందనం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Post a Comment