హవాయిలో పచ్చల వాన

హవాయిలో పచ్చల వాన
హవాయి ప్రాంతంలోని  అగ్నిపర్వతం కొన్ని వారాలపాటు లావాను వెదజల్లిన తరువాత ఇప్పుడు ఆకుపచ్చని రంగు రాళ్లను వెదజల్లటం ప్రారంభించింది.   అక్కడి స్థానికులు వీటిని పెద్ద మొత్తంలో సేకరించి దాచుకుంటున్నారు. అయితే ఇవి ఖరీదయిన పచ్చలేమీ కాదని ఒలివీన్‌ అనే సాధారణ రంగు రాళ్ళని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అగ్ని పర్వతాల ధూళిలో ఇలాంటివి కనపడటం అసాధారణమేమీ కాదట. లావాలోని అధిక ఉష్ణోగ్రతల కారణంగా  రసాయనాలు ఘనీభవించి ఇలా పచ్చల్లా మారతాయట.  

ఈ అగ్ని పర్వత విస్పోటం కారణంగా భారీగా  ఇళ్ళు ధ్వంసమయ్యాయి.  పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.  ఈ లావా కారణంగా హవాయి ద్వీపంలో 2. 1 కిలోమీటర్ల కొత్త తీరప్రాంతం ఏర్పడింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post