పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లిన ప్రబుద్ధుడు

పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లిన ప్రబుద్ధుడు
భార్యను తొందరగా ఆసుపత్రిలో  చేర్చటానికి  ఓ వ్యక్తి దారిలో కనిపించిన పోలీస్ వాహనాన్ని దొంగిలించాడు.  ఆశ్చర్యపరిచే  ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి లింగరాజు అనే 30 ఏళ్ల వయసు గల వ్యక్తి తన భార్యను ఆసుపత్రి కి తీసుకెళ్లడానికి ఈ విధంగా  చేసాడు.  TS 09PA 1568  అనే నంబర్ గల వాహనము డ్రైవర్ ఇంకా ఎస్కార్ట్ తో షాపింగ్ మాల్ బయట పార్క్ చేసి ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.  లింగరాజు డ్రైవరు తో సి ఐ  తనను వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకు రమ్మన్నాడని తెలిపి వాహనాన్ని ధైర్యంగా తీసుకెళ్లడం గమనార్హం. ఈ విషయాన్ని ఇన్స్ పెక్టర్ తిరిగి వచ్చే వరకు వారు గుర్తించలేకపోయారు. 

ఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత తిరుపతి లింగరాజు ఖమ్మం జిల్లా లోని ఒక టోల్ గేట్ వద్ద నలుగురు స్నేహితులతో దొరికిపోయాడు.  ఈ వాహనానికి పోలీస్ స్టిక్కర్స్, బేకన్ లైటింగ్  కూడా  ఉన్నాయి. లింగరాజుని మనస్థిమితం లేని వ్యక్తి గా అతని స్నేహితులు వెల్లడించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post