తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం లో స్వచ్ఛందంగా వదులుకోవడాన్ని ఊహించిన దానికన్నా చాలా తక్కువ మంది ఎంచుకున్నారు. రాష్ట్రం లో పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగిన 57 లక్షల మంది వ్యక్తులలో కేవలం 1075 మంది మాత్రమే దీనిని ఎంచుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణాలోని రైతులందరికీ వారి సాంఘిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఎకరాకు, పంటకు నాలుగు వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని ఈ పథకం కింద ప్రకటించింది. వద్దనుకున్న వారు స్వచ్ఛందంగా వదులుకోవచ్చు. కానీ ప్రభుత్వం వదులుకోవటాన్ని పెద్దగా ప్రచారం చేయలేదు. వదులుకున్న వారిలో ఎమ్మెల్యేలు, సినీ తారలు, ఉన్నతాధికారులు, ఇండస్ట్రియలిస్టులు ఇతర రాజకీయ నాయకులు ఉన్నారు.
ప్రభుత్వం ఈ పథకం కింద దాదాపు 6000 కోట్లు విడుదల చేయగా ఇప్పటివరకు 4300 కోట్లు పంపిణీ చేశారు. కేవలం 1.7 కోట్లు వొదులుకోబడ్డాయి. ఈ పథకం కింద చెక్కుల పంపిణీ ఈ నెల 20 వ తేదీ తో ముగియనుంది.
Post a Comment