శ్రీసప్తముఖ కాల సర్ప మహాగణపతి

ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు,  శ్రీసప్తముఖ కాల సర్ప మహాగణపతి గా కొలువుతీరనున్నాడు. విగ్రహం ఎత్తు 57 అడుగులు కాగా వెడల్పు 27 అడుగులుగా ఉండనుంది. శాంత స్వరూపం తో కనిపించే ఈ వినాయకుడు, 7 మొఖాలు, 14 చేతులు కలిగి ఉంటాడు. కుడి వైపు చేతుల్లో ఆంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద లతో పాటు ఆశీర్వాద ముద్ర కూడా ఉండనుంది. ఎడమ వైపు చేతుల్లో పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లూ, కడియం, లడ్డూ ఉండనున్నాయి.  ఆదిశేషుడు వినాయకుడి తలపైన తన పడగలతో నీడను కల్పించ నుండగా  వెనుక వైపు ఆరు ఏనుగులు ఐరావత రూపంలో స్వామి వారిని కొలుస్తున్నట్లు కనిపిస్తాయి.  గణేశునికి ఇరువైపులా ఉండే చిరు మండపాల్లో కుడి వైపున లక్ష్మీ దేవి, ఎడమ వైపున చదువుల తల్లి సరస్వతి దేవి కొలువై ఉండనున్నారు. పాదాల వద్ద స్వామివారి వాహనం ఎలుక భజన ముద్రలో ఉండనుంది. మే 25వ తేదీన కర్ర పూజ తో మొదలైన విగ్రహ తయారీ సెప్టెంబర్ మొదటివారంతో పూర్తి కానుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post