ముందస్తు ఎన్నికలకు తాము కూడా సిద్ధమేనని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనీ, ఎన్నికలలో వారికి ఒక్కసీటు కూడా రాదనీ, డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో, పీసీసీ అధ్యక్షునితో సహా కాంగ్రెస్ నేతలందరికీ తెలుసునని, ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కూడా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు చేసారని కూడా ఆరోపించారు. దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం చేసింది ఆ పార్టీయేనని దుయ్యబట్టారు.
Post a Comment