కేంద్ర ప్రభుత్వం, 1975 లో కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీ గురించి విద్యార్థులకు పూర్తి వివరాలు తెలియటం కోసం పాఠశాల మరియు కళాశాల పాఠ్యపుస్తకాలను సవరించనుంది. ఆ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కులు హరింపబడ్డాయి, ప్రతిపక్ష నాయకులపై అణిచివేత చర్యలు చేపట్టారు. ఇది మన ప్రజాస్వామ్యం పై మాయని మచ్చ వంటిది. ఇవన్నీ పుస్తకాలలో చేర్చవలసిన అవసరం ఉంది అని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం రోజు అన్నారు.
అత్యవసర పరిస్థితి విధించిన 43 వ వార్షికోత్సవం సందర్భంగా జైపూర్లో ప్రసంగించిన జవదేకర్, భారత ప్రజాస్వామ్యంలో నల్లని మచ్చ వంటి అత్యవసర పరిస్థితి పై, కాంగ్రెస్ చెబుతున్న క్షమాపణలు ఆమోదయోగ్యం కావని అన్నారు. కాంగ్రెస్ తాను చేసిన నేరానికి తగిన శిక్షను అనుభవించాలి. ఆ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి వీల్లేకుండా చేయాలి. అని కూడా అన్నారు.
Post a Comment