ఇరాక్ ప్రభుత్వం 12 మంది తీవ్రవాదులకు మరణ శిక్షలను అమలు చేసింది. ఎనిమిది మంది భద్రతా దళ సిబ్బంది కిడ్నాప్ మరియు హత్యలకు ప్రతిస్పందనగా, తీవ్రవాదులకు మరణ శిక్షలను త్వరిత గతిన అమలు చేయాలని ప్రధాని హైదర్ అల్-అబాది పిలుపు నిచ్చిన కొన్ని గంటలలోనే ఇవి అమలయ్యాయి.
ప్రధాన మంత్రి హైదర్ అల్- అబాది యొక్క ఆదేశాలకు అనుగుణంగా, తుది తీర్పుగా మరణశిక్షలు పొందిన 12 మంది తీవ్రవాదులకు శిక్షలు గురువారం రోజు అమలు జరిగాయి. అని ప్రభుత్వ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు, ఎనిమిది మంది ఇరాక్ భద్రతా దళ సభ్యులను కిడ్నాప్ చేశారు. శనివారం ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన వీడియోలో వారిలో ఆరుగురిని చూపించారు. ప్రభుత్వం సున్నీమహిళా ఖైదీలను విడుదల చేయని పక్షంలో వారిని మూడు రోజుల్లో చంపుతామని బెదిరించారు.
ఇస్లామిక్ స్టేట్ కిడ్నాపర్లు పెట్టిన గడువు ముగిసిన రెండు రోజుల తర్వాత, పేలుడు పదార్థాలతో ముక్కలు చేయబడిన ఎనిమిది మంది మృతదేహాలను, భద్రతా దళాలు బుధవారం రోజు కనుగొన్నాయి.
Post a Comment