స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2017 లో 1.01 బిలియన్ స్విస్ ఫ్రాంకుల (సుమారు 7,000 కోట్లు) కు పెరిగాయి. అంటే సంవత్సర కాలంలో 50% పెరిగాయి.
భారతీయుల స్విస్ బ్యాంకు డిపాజిట్లపై ఆంక్షలున్నా, ప్రభుత్వం నల్ల ధనం పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ డిపాజిట్లు పెరగటం గమనార్హం. స్విస్ బ్యాంకులు గోప్యతకు పెద్ద పీట వేయటం భారతీయ డిపాజిట్లను ఆకర్షించే అంశం.
ఎన్నికల హామీల్లో భాగంగా మోడీ, విదేశాల్లో నుండి నల్లధనం తీసుకువస్తామని చెప్పినప్పటికీ, కనీసం కొత్తవి వెళ్లకుండా ఆపలేకపోతున్నారు. ఈ వార్త ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
Annual banking statistics, 2017 https://t.co/7dFNkvG2l7— Swiss National Bank (@SNB_BNS_en) 28 June 2018
Post a Comment