తీవ్రవాదులకు ఆర్థిక సహాయం అందటాన్ని నిరోధించటంలో విఫలమైనందుకు, పాకిస్తాన్ ను గ్రే జాబితా లో ఉంచారు. ఆ దేశం దీని నుండి బయటపడటానికి దౌత్య ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
ముంబై దాడుల నాయకుడు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని JUD , దాని అనుబంధ సంస్థలతో సహా, తీవ్రవాద గ్రూపులకు నిధులను అందకుండా చేయటానికి, 26 పాయింట్ల సమగ్ర ప్రణాళికను పాకిస్తాన్ FATF కు సమర్పించిన ఒక రోజు తర్వాత ఆ దేశాన్ని గ్రే జాబితా లో చేర్చటం గమనార్హం. 2012 నుండి 2015 వరకు కూడా పాకిస్తాన్ ఈ జాబితాలో కొనసాగింది. పాకిస్తాన్ సమర్పించిన ప్రణాలికను అమలు చేయలేకపోతే ఆ దేశాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఆ లిస్ట్ లోకి వెళితే పాకిస్తాన్ ఆర్థిక స్థితి మరింత దిగజారుతుంది.
FATF అనేది ప్రపంచ వ్యాప్తంగా మనీ లాండరింగ్, తీవ్రవాద ఫైనాన్సింగ్ మరియు ఇతర బెదిరింపులను ఎదుర్కొనేందుకు 1989 లో స్థాపించబడిన ఒక అంతర్జాతీయ సంస్థ.
Post a Comment