కోతిమూక అధికారంలోకి వస్తే.....

కోతిమూక అధికారంలోకి వస్తే.....
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అధికారంలోకి రావడానికి కొంతమంది సాధ్యం కాని వాగ్దానాలు చేస్తున్నారనీ, అలాంటి  కోతిమూక అధికారం లోకి వస్తే రాష్ట్రం ముక్కలవుతుందని కూడా వ్యాఖ్యానించారు. కేవలం తాము అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని కూడా అన్నారు. 

ముఖ్య మంత్రిగారు తన నివాసం లో, తమ జీతాలను పెంచిన సందర్భంగా ధన్యవాదాలు తెలపటానికి వచ్చిన అంగన్వాడీ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. వారిని, కేవలం తాము అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, ఈ విషయాన్ని గ్రామాలలో తెలియజేయాల్సిన బాధ్యత అంగన్వాడీ ఉపాధ్యాయులదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన GST, నోట్ల రద్దు వల్ల ప్రజలు కష్టాలనెదుర్కొన్నారని, వ్యవసాయరంగాన్ని కూడా వారే నాశనం చేసారని దుయ్యబట్టారు.

కేంద్రం నుండి ఏ విధమైన సహాయం అందకపోయినా తాను సంపదను సృష్టించాననీ, సమాజం లో సంతోషం, సంతృప్తి కనిపిస్తున్నాయని తెలిపారు. మీరందరూ నాకు తోడుగా ఉంటే రాష్ట్రములో ప్రతిపక్షం అనేది ఉండదు మరియు అభివృద్ధి కొనసాగుతుంది. అని వారితో అన్నారు. మీరు తెలుగు దేశం పార్టీని మొత్తం 25 స్థానాల్లో గెలిపిస్తే మనం కేంద్రం లో ఎవరు ప్రధానమంత్రి అవుతారో నిర్ణయించవచ్చు. మనకు కావలసినవి డిమాండ్ చేసి తెచ్చుకోవచ్చు అని కూడా అన్నారు. ఈ కార్యక్రమం లో మంత్రి పరిటాల సునీత కూడా పాల్గొన్నారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post