నాకూ అన్యాయం జరిగింది


శుక్రవారం కాంగ్రెస్ కు రాజీనామా చేస్తూ, పార్టీలో వెనుక బడిన తరగతు(బిసి)లకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపి, ఎఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు సమర్థించారు. 

శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కానీ తాను పార్టీ లో ఉండే పోరాడతాననీ, ఎటువంటి పరిస్థితులలో కూడా పార్టీని విడిచే ప్రసక్తే  లేదని అన్నారు. 

కేవలం ఒకేసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా  గెలిచిన హనుమంతరావు గారు, ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం.  తర్వాత ఎన్నోసార్లు ఎన్నికలలో ఓడిపోయినా, పార్టీ ఆయనని ఎమెల్సీ గా, మంత్రిగా, మూడు సార్లు రాజ్య సభ్యునిగా గౌరవించింది. ఇప్పుడు కూడా ఆయన ఎఐసిసి కార్యదర్శిగా ఉన్నారు.  ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఇతర నేతలు అడ్డుపడ్డారని ఆయన అభియోగం. 

0/Post a Comment/Comments