జకీర్ నాయక్ కు లభించని ఉపశమనం

ఇవాళ బాంబే హైకోర్టు వివాదాస్పద ఇస్లామిక్ ప్రచారకర్త జకీర్ నాయక్ కు  ఉపశమనం కలిగించటానికి నిరాకరించింది. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టినట్లు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన దర్యాప్తు సంస్థలకు ఎటువంటి సహకారం అందించటం లేదని కోర్టు భావించింది.

న్యాయమూర్తులు  R.M. సావంత్ , రేవతి మొహితె లతో కూడిన డివిజన్ బెంచ్ ను, నాయక్ తనకు వ్యతిరేకంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) మరియు ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఇడి) జరిపిన దర్యాప్తులపై నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే తన పాస్ పోర్ట్ ఉపసంహరణను రద్దు చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

పాస్ పోర్ట్ ఉపసంహరణ విషయంలో  తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని, దానికి ఒక ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు నాయక్ ను కోరింది. పిటిషన్లో కోరబడిన ఇతర ఉపశమనాల విషయంలో  కోర్టు స్పందిస్తూ పిటిషనర్ దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా, మలేసియా లో ఉండి ఇలా ఆదేశాలు జారీ చేయాలని పేర్కొనడం సరికాదని పేర్కొంది. నాయక్ పై ఆరోపించబడుతున్నవి జీవిత శిక్షను ఎదుర్కోవాల్సిన తీవ్రమైన నేరాలని, తాము ఉపశమనం కలిగించలేమని తేల్చి చెప్పింది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post