ధఢక్‌ సినిమా టైటిల్‌ సాంగ్

జాన్వి కపూర్‌ , ఇషాన్‌ ఖట్టర్ తో కలిసి నటిస్తున్న సినిమా ధఢక్‌.  కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ సాంగ్  ధఢక్‌ హై నాను ఇవాళ విడుదల చేశారు. అజయ్‌-అతుల్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. శ్రేయా ఘోషల్‌, అజయ్‌ గొగావలే ఈ గీతాన్ని ఆలపించారు. మరాఠీ బ్లాక్‌బస్టర్‌ సైరత్‌ కు హిందీ రీమేక్‌ అయిన ఈ  సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటీవల విడుదల చేసిన ధఢక్‌ సినిమా ట్రైలర్‌కు కూడా అద్భతమైన స్పందన లభించింది.  దానిని మీరు ఇక్కడ చూడవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post