ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ రాజీనామా

ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) అరవింద్ సుబ్రహ్మణ్యన్ తన పదవికి రాజీనామాను సమర్పించారు. కుటుంబ బాధ్యతల వల్ల అమెరికాకు తిరిగి వెళ్లాలనే కోరికను ఆయన వ్యక్తం చేసినట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు ఇవాళ ప్రకటించారు.

కొన్ని రోజుల క్రితం, ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  నాతో సమావేశమై కుటుంబ బాధ్యతల విషయాలను తెలియజేసారు. ఆయన కారణాలు వ్యక్తిగతమైనవి కానీ చాలా ముఖ్యమైనవి. అతను నాకు ఇంకో అవకాశం ఇవ్వలేదు కానీ నేను అతనితో ఏకీభవించలేను. అని జైట్లీ ఒక ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు. 

సుబ్రహ్మణ్యన్ గారు అక్టోబరు 16, 2014 న  మూడు సంవత్సరాల కాల పరిమితితో ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) గా నియమింపబడ్డారు. మూడు సంవత్సరాల పూర్తయిన తర్వాత, అతను  మరొక సంవత్సరం పాటు కొనసాగేలా అంగీకరింపచేసాము. ఆ సమయంలోనే ఆయన కుటుంబ బాధ్యతల గురించి ఆలోచించారు.  నిజానికి అతని పదవి కాలపరిమితి అక్టోబర్ 2018 వరకు ఉంది.  

సుబ్రహ్మణ్యన్ గారు తన పదవీ బాధ్యతలను అత్యుత్తమంగా నెరవేర్చారు. అతను లేకపోవటం వల్ల  అతని చైతన్యం, శక్తి, మేధో సామర్థ్యం మరియు ఆలోచనలు కోల్పోతామని వివరించారు. ప్రతీ రోజూ ఎన్నోసార్లు నన్ను సంప్రదించేవాడు. తను ఎక్కడున్నా సలహాలను మరియు విశ్లేషణను పంపుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.  అని అరుణ్ జైట్లీ గారు వివరించారు. 

ఫేస్ బుక్ లో జైట్లీ గారి నుండి 
https://www.facebook.com/notes/arun-jaitley/thank-you-arvind/804077679780782/

0/Post a Comment/Comments

Previous Post Next Post