అతి పొడవైన పోలీస్

పంజాబ్‌ పోలీసు విభాగంలో ట్రాఫిక్‌ పోలీసు గా పనిచేస్తున్న జగ్దీప్‌ సింగ్‌ ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు, బరువు 190 కిలోలు. ఇతనిని ప్రపంచంలోనే అతి పొడవైన పోలీసు గా భావిస్తున్నారు. గిన్నిస్‌ బుక్ కి దరకాస్తు చేసానని, త్వరలోనే వారు కూడా ఈ రికార్డును గుర్తించనున్నారని జగ్దీప్‌ చెబుతున్నాడు.

జగ్దీప్‌ సింగ్ ఎత్తు వల్ల ఇతను ప్రత్యేకంగా గుర్తింపబడుతున్నాడు. ఎక్కడికెళ్లినా సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. సామాన్యులు ఇతని భుజం వరకు కూడా ఉండరు. ఇతను ఎత్తును దేవుడిచ్చినదిగా భావిస్తాడు. 

ఇతని హైట్ తో ఇతనికి చాలా సమస్యలు కూడా ఉన్నాయి  ఇతడి షూ సైజు 19. మన దగ్గర దొరకదు.  దీంతో విదేశాల నుంచి గానీ ప్రత్యేక ఆర్డర్ ద్వారా గానీ తెప్పించుకోవాలి. బట్టల విషయం కూడా అంతే. ఎవరి  ఇంటికైనా వెళ్ళినప్పుడు పైకప్పును తాకేంత ఎత్తుతో ఇబ్బంది పడుతుంటాడు. కార్లు, బైకులు ఇతని ముందు చిన్నగా కనిపిస్తుంటాయి. వాటి పై ప్రయాణం ఇతనికి ఇబ్బందే. ఇంత ఎత్తు అంటే ఏదో ఆరోగ్య సమస్య ఉంటుందన్న కారణంతో ఇతనికి పిల్లనిచ్చేవారు కూడా కరువయ్యారు. చివరికి ఇతనికి తగ్గ అమ్మాయి దొరకటం తో పెళ్లి చేసుకున్నాడు. ఇతడి భార్య ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. 

జగ్దీప్‌ పర్సనాలిటీ చూసి సోషల్‌ మీడియాలో ఇతడిని రాక్షసుడు, ఏలియన్ అన్నవారూ ఉన్నారు.  ఇప్పటివరకు ఎత్తైన వ్యక్తి గా గిన్నిస్ బుక్ లో ఉన్న వ్యక్తి రాబర్ట్ వాడ్లో. ఇతని ఎత్తు 8 అడుగుల 11 అంగుళాలు.  ఇతను తన 22 వ ఏట చనిపోయాడు.  బతికున్నవారిలో ఎత్తైన వ్యక్తి టర్కీ కి చెందిన సుల్తాన్ కోసెన్ ఇతని ఎత్తు 8 అడుగుల 3 అంగుళాలు. 

0/Post a Comment/Comments