నలుగురు మలయాళ నటీమణులు తమ అసోసియేషన్ అయిన అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్) నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. నటి భావన తో పాటు నటీమణులు రిమా కలింగల్, రమ్య నంబిసన్, గీతా మోహన్‌దాస్‌లు కూడా అమ్మకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా వారు తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
గతేడాది భావనపై జరిగిన లైగింక వేధింపు ఘటనలో నటుడు దిలీప్ కూడా నిందితుడు కావడంతో, అమ్మ ఆయనపై నిషేధం విధించింది. కానీ తాజాగా అతనిపై నిషేధాన్ని ఎత్తివేయడంతో, నటీమణులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అమ్మ మహిళల కోసం ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదు, ఇంకా అలాంటి వారికి మద్ధతు ఇస్తున్నప్పుడు మేము కొనసాగడం అనవసరం అని వారు వ్యాఖ్యానించారు.
Post a Comment