2019 నుండి చాబహార్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలు

2019 నుండి చాబహార్ నౌకాశ్రయం ద్వారా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలని భారతదేశం భావిస్తోంది.  ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత దేశం వెనక్కు తగ్గకపోవటం గమనార్హం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ పోర్టు ప్రారంభం తర్వాత మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం సులభతరమవుతుందని అన్నారు.  

దుషాంబే (తజికిస్తాన్) లోని భారత దౌత్య కార్యాలయం గురువారం జరిగిన ఒక  కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. 2016 లో మన దేశం, ఇరాన్ మరియు ఆఫ్గనిస్తాన్ లతో ఈ రవాణా కారిడార్ను అభివృద్ధి చేయటానికి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది.

0/Post a Comment/Comments