కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం తెలుగు దేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జడ్పీ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ బీటెక్‌రవి కూడా ఎంపీతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ రాకుండా కేంద్రం అడ్డుపడుతోందని, పరిశ్రమను స్థాపించేవరకూ తాము ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని సీఎం రమేష్ స్పష్టంచేశారు. తమ దీక్షకు మద్ధతునివ్వవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని చెప్పి ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసినా, ప్రతిపక్ష నేత జగన్ ఏమీ చేయకపోవటం విచారకరమన్నారు. వీరు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరాహార దీక్షలోనూ ప్రతిపక్ష నాయకున్ని విమర్శించకుండా ఉండకపోవటం గమనార్హం.
Post a Comment