గుర్మీత్ రామ్ రహీం సింగ్ (డేరా బాబా), ఈయన విలాసవంతమైన జీవనాన్ని గడిపే ఆధ్యాత్మిక వేత్తగానే అందరికీ తెలుసు. ఆయన ఆడంబరాలకు ఎంత ప్రాధాన్యతనిచ్చేవారనేది, ఆయన జిగేల్ మనే వస్త్రధారణ, ఆశ్రమం లోని హంగులు , సినిమాల్లో నాయకుడిగా నటించటం లాంటి వాటి ద్వారా గమనించవచ్చు.
అలాంటి డేరా సచ్చా సౌధా అధిపతి, ప్రస్తుతం రోహ్‌తక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. దీనిలో భాగంగా వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, వెయ్యి గజాల స్థలంలో ఆలుగడ్డ, టమాట, సోరకాయ, బీరకాయ, అలోవీరాలను పండిస్తున్నాడు. దీనికి గాను ఆయనకు రోజుకు 20 రూపాయల కూలీని అందిస్తున్నారు.
జైల్లో కూలీని ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాలోకి చెల్లిస్తారు. ఇప్పటికే గుర్మీత్ బ్యాంకు ఖాతాలను పంజాబ్-హర్యానా హైకోర్టు స్తంభింపజేయడంతో ఈ ఇరవై రూపాయల నగదు కూడా ఆయన ఇప్పట్లో పొందే అవకాశం లేదు.
Post a Comment