100 కోట్ల తుపాకుల్లో 39.3 కోట్లు అమెరికన్ ప్రజల వద్దే

ప్రపంచంలోని 100 కోట్ల తుపాకుల్లో (హ్యాండ్ గన్, షార్ట్ గన్, రైఫిల్ మరియు మెషిన్ గన్ అన్నీ కలిపి), 39.3కోట్లు సామాన్య అమెరికన్ ప్రజల వద్దే ఉన్నట్లు ఒక అధ్యయనం తెలియజేసింది. అంతే కాకుండా వారు ఒక కోటి నలభై లక్షల తుపాకులని ప్రతి ఏటా కొనుగోలు చేస్తున్నారు. ఈ దేశంలో ఇప్పటికే ప్రతి 100 మంది ప్రజలకు 121 తుపాకులున్నాయి. 

అమెరికా విస్తారమైన సివిలియన్ ఆయుధ మార్కెట్ ని కలిగిఉంది. ఇక్కడి ప్రజల గన్ కల్చర్ విలక్షణమైనది. దీనిని వ్యతిరేకించే వారు ఎంతమంది ఉన్నారో, సమర్థించే వారు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. మన దేశంలో లాగా కాకుండా అక్కడ గన్ కలిగి ఉండటం పౌరుల ప్రాథమిక హక్కు. ఆత్మ రక్షణకు తుపాకీ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం అని వారు భావిస్తారు.  ఏది ఏమైనప్పటికీ ప్రతి ఏటా అక్కడ తుపాకుల అమ్మకాలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post