చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి కంపెనీ సీఈవో మృతి

చార్జింగ్‌ పెట్టిన మొబైల్ పేలిపోవటంతో  క్రడిల్ ఫండ్ సీఈవో నజ్రీన్ హసన్ దుర్మరణం పాలయ్యారు. ఆయన వయసు 45 సంవత్సరాలు నజ్రీన్‌ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

ఇప్పటి వరకు వచ్చిన వార్తల ప్రకారం నజ్రీన్, తన రెండు మొబైల్ ఫోన్లను తన బెడ్ పక్కనే చార్జింగ్ లో ఉంచగా వాటిలో ఒకటి పేలి,  మంటలు పరుపునకు అంటుకొని గది అంతా వ్యాపించాయి. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో మొబైల్ పేలిన సమయంలో అందులోని కొన్ని విడి భాగాలు నజ్రీన్ తలకు బలంగా తగిలాయని తేలింది. పోలీసు రిపోర్టులో బెడ్‌రూమ్‌లో వ్యాపించిన మంటలు, తద్వారా వెలువడిన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయాడని ఉన్నట్లు తెలుస్తోంది. అతని దగ్గర ఉన్నరెండు  ఫోన్లు బ్లాక్‌బెర్రీ మరియు హువాయ్. వాటిలో ఏది పేలిందనేది ఇంకా తెలియరాలేదు. 

క్రడిల్ ఫండ్ అనే సంస్థ మలేషియా ప్రభుత్వ ఆర్థిక శాఖ కు సంబంధించినది. కొత్తగా వచ్చే పారిశ్రామిక వేత్తలకు , స్టార్టప్ సంస్థలకు  ఈ సంస్థ ప్రోత్సాహక నిధులు అందజేస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post