బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మరియు నటుడు ఆయుష్మాన్ ఖురానాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన FBB కలర్స్ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో తమిళనాడుకు చెందిన కళాశాల విద్యార్ధి అనుక్రీతి వాస్ (19) మిస్ ఇండియా 2018 గా విజయం సాధించింది. ఈ అందాల పోటీల్లో హర్యానా కు చెందిన మీనాక్షి చౌదరి (21) మొదటి రన్నర్ అప్ గా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీ రావు కామవరపు (23) రెండో రన్నర్ అప్ గా నిలిచారు.
బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్ ఖాన్, జాక్వెలిన్ ఫర్నాండెజ్ , మాధురి దీక్షిత్ మరియు మిస్ వరల్డ్ 2017 మనుషి చిల్లర్ లు ఈ వేడుకలో తమ ప్రదర్శనలతో అలరించారు.
క్రికెటర్లు కె.ఎల్. రాహుల్, ఇర్ఫాన్ పఠాన్, నటులు బాబీ డియోల్, మలైకా అరోరా మరియు కునాల్ కపూర్ లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
అనుక్రీతి వాస్ ఇప్పుడు మిస్ వరల్డ్ 2018 లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనుంది. మీనాక్షి చౌదరి, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 లో మరియు శ్రీ రావు కామవరపు, మిస్ యునైటెడ్ కాంటినెట్స్ 2018 లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.
Post a Comment