భారతీయ విద్యార్థులకు UK వీసాలు కష్టమే!

భారతీయ విద్యార్థులకు UK వీసాలు కష్టమే!
UK ప్రభుత్వం విద్యార్థులకు వీసాలు సులభతరం చేసిన 25 దేశాల జాబితా లో భారత దేశానికి స్థానం లభించలేదు.  ఈ బిల్లును UK పార్లమెంట్ లో జూన్ 15 న ప్రతిపాదించారు. ఈ జాబితా లో US, కెనడా, న్యూజీలాండ్ లాంటి దేశాలతో పాటు చైనా, మెక్సికో, బెహ్రెయిన్లు కూడా ఉండటం విశేషం. ఈ సవరణలు జులై ఆరవ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. 

భారతీయ విద్యార్థులు క్లిష్టతరమైన ఆర్థిక, విద్యా మరియు ఆంగ్ల భాషా నైపుణ్యాలకు సంబంధించిన పత్రాలను యధావిధిగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విషయమై విద్యార్థి, రాజకీయ, వ్యాపార వర్గాల నుండి తీవ్ర నిరసన, నిరాశ వ్యక్తమవుతోంది. బ్రెక్సిట్ తర్వాత మన దేశం తో కుదుర్చుకున్న స్వేచ్చా వ్యాపార ఒప్పందాన్ని (FTAను) ఈ ప్రతిపాదనలు నీరుకారుస్తాయని పలువురు వ్యాఖ్యానించారు. కాగా అన్ని దేశాలనుండి UK కు వచ్చే డాక్టర్లకు, నర్సులకు వీసా నిబంధనలు సడలించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post