గత కొన్ని రోజులుగా లెఫ్టనెంట్ గవర్నర్ నివాసంలో దీక్షకు దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు నలుగురు ముఖ్యమంత్రుల మద్దతు లభించింది. బిజెపి వ్యతిరేకతే అజెండాగా కలిగిన ఆంధ్ర ప్రదేశ్ (చంద్రబాబు నాయుడు), కేరళ (పిరనయి విజయ్ ), కర్ణాటక (కుమారస్వామి) మరియు పశ్చిమ బెంగాల్ (మమతా బెనర్జీ) రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి ఈ మద్దతు లభించటం విశేషం.
ఆదివారం జరిగే నీతి ఆయోగ్ లో పాల్గొనేందుకు శనివారం ఉదయమే ఢిల్లీ వచ్చిన ఈ నలుగురు ముఖ్య మంత్రులు, ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను, అతని నివాసమైన రాజ్ నివాస్ లో కేజ్రీవాల్ ను కలవటానికి ఇంకా అతని తరపున గవర్నర్ కు వినతిపత్రం సమర్పించేందుకు అనుమతి కోరారు. గవర్నర్ నిరాకరించటం తో వీరు కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం వ్యక్తపరిచారు. అలాగే నరేంద్ర మోడీ ఈ విషయంలో కలుగజేసుకొని రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించాల్సిందిగా డిమాండ్ చేసారు.
కాగా ఢిల్లీ బిజెపి వర్గాలు కేజ్రీవాల్ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి తనను తాను బిగ్ బాస్ షో లో బంధించుకొని ప్రజలకు రియాలిటీ షో చూపిస్తున్నాడని వ్యంగ్య వ్యాఖ్యానాలు చేయటం విశేషం.
Post a Comment