లోక్ సభ ఎన్నికలకు ముందే మహా కూటమి ఏర్పాటు ఆచరణ సాధ్యమైన విషయం కాదని ఎన్సీపి నేత శరద్‌పవార్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలను ఒకే తాటి పైకి తేవటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో పార్టీలు తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలే ఆ పార్టీలకు ముఖ్యం. ఎన్నికల అనంతరం ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అప్పుడే అవి అధికారంలో భాగస్వాములవడానికి మహా కూటమిగా ఏర్పడే అవకాశాలున్నాయి. అని శరద్‌పవార్ అన్నారు.
Post a Comment