ఎయిర్‌ ఏషియా ప్రయాణీకులకు చేదు అనుభవం

ఎయిర్‌ ఏషియా విమానంలో కోల్‌కతా నుంచి బగ్‌ డోగ్రాకు బయల్దేరిన ప్రయాణీకులకు  సిబ్బంది  దురుసు ప్రవర్తనతో చేదు అనుభవం ఎదురైంది.

ఇదే విమానంలో ప్రయాణిస్తున్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ (పశ్చిమ బెంగాల్‌) దీపాంకర్‌ రే ఎయిర్‌ లైన్‌ స్టాఫ్‌ ప్రయాణీకులతో మొరటుగా ప్రవర్తించారని చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం

"ఉదయం తొమ్మిది గంటలకు బయల్దేరవలసిన  విమానం తొలుత 30 నిమిషాల పాటు ఆలస్యమవుతుందని ప్రకటించారు. అనంతరం రెండు గంటలకు పైగా విమానంలోనే ఉంచారు. ఆ సమయంలో ఎయిర్‌లైన్‌ స్టాఫ్‌ ప్రయాణీకులకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేదు. 

ఆ తర్వాత కిందకి దిగమని కోరారు . బయట విపరీతంగా వర్షం కురుస్తుండటంతో ప్రయాణీకులు ఎవరూ దిగటానికి ఆసక్తి చూపలేదు. దీంతో కోపగించుకున్న కెప్టెన్‌ ప్రయాణీకులు దిగిపోవడానికి ఎయిర్‌ కండిషనర్‌ను విపరీతంగా పెంచేశారు. దానితో విమానంలో పొగ మంచు లాంటి వాతావరణం ఏర్పడింది. అప్పుడు కొంతమంది ప్రయాణీకులకు శ్వాస ఆడలేదు,  కొందరు వాంతులు చేసుకున్నారు, పిల్లలు బిగ్గరగా ఏడుపు ప్రారంభించారు.  ఆ విధంగా బలవంతంగా కిందకు దించారు.  దాదాపు నాలుగున్నర గంటల తర్వాత విమానం తిరిగి బయల్దేరింది."

కాగా, విమానం ఆలస్యం కావడంపై ఎయిర్‌ ఏషియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. నాలుగున్నర గంటల పాటు ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరింది. తాము ప్రభావితం అయిన ప్రయాణికులను ఆహార కోర్టుకు వెళ్ళమని కోరామనీ, రెఫ్రెషమెంట్లు అందించామనీ తెలిపింది.

రే ఎయిర్ ఏషియా ప్రకటన ను ఖండించారు. మేము ఆహార కోర్టుకు చేరినప్పుడు వారు మాకు ఏమీ ఇవ్వలేదు. మేము చెల్లించి తినవలసి వచ్చింది, మేము విమానం రెండవసారి ఎక్కాక మాత్రం వారు మాకు ఒక శాండ్విచ్ మరియు 250 మిల్లీలీల నీటి బాటిల్ ఇచ్చారు. అని తెలిపారు.

ఇది భారతదేశం లో ఏవియేషన్ పరిశ్రమ ఏ విధంగా పనిచేస్తుందనేది తెలియజేసింది. ఈ విమానయానం చాలా భయానకంగా ఉంది. ఎయిర్ ఏషియాలో ప్రయాణించకండి అని ఫేసు బుక్ లో తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post