బాహుబలికి అంతర్జాతీయ అవార్డు

బాహుబలికి అంతర్జాతీయ అవార్డు
ఇప్పటికే ఎన్నో విజయాలు, రికార్డులు మరియు అవార్డులు సొంతం చేసుకున్న బాహుబలి 2 చిత్రానికి, ప్రతిష్టాత్మకమైన సాటర్న్ అవార్డు లభించింది.  44వ సాటర్న్ అవార్డ్స్‌లో  ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. ఈ అవార్డు కోసం ఆరు చిత్రాలు పోటీ పడగా బాహుబలి విజయం సాధించటం విశేషం. ఈ వేడుక బుధవారం రోజు కాలిఫోర్నియా లో జరిగింది. 

అకాడెమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ & హారర్ ఫిల్మ్స్ అనే అంతర్జాతీయ సంస్థ 1972 నుండి సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ , హారర్ విభాగాల్లో సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లకు సాటర్న్ అవార్డుల అందజేస్తుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post