అప్పటికప్పుడు నాలిక భలే మడతేసారే?

ఈ నెల పదకొండవ తేదీన టీవీ9 లో  ప్రసారమైన ఎన్ కౌంటర్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మురళీకృష్ణ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

మొదట ప్రత్యేక హోదా, కేంద్రం నుండి సాధించుకోవాల్సిన విషయాలు, పవన్ కళ్యాణ్ లాంటి విషయాల గురించి మాట్లాడిన తర్వాత మురళీకృష్ణ తెలంగాణ ప్రభుత్వం వోట్ కి నోటు కేసును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిందా అని అడిగారు. దానికి కేటీఆర్ తాము ఆ విషయాలలో జోక్యం చేసుకోబోమని, చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందని అన్నారు. తర్వాత నయీమ్ గురించి అడిగిన ప్రశ్నకు అతన్ని 20 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని తాము మాత్రమే నిలువరించామని పేర్కొన్నారు. అంటే ఇక్కడ పోలీసులు మంచి చేస్తే అది తమ ప్రభుత్వ ఘనత, వారు తమ ప్రభుత్వానికి చెందిన వారు, లేకపోతే అది చట్టానికి సంబంధించిన విషయం అన్నమాట. ఆ వీడియో ను ఇక్కడ చూడవచ్చు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post