ఒక్క ట్వీట్ తో పోలీస్ వ్యవస్థ మారిపోతుందా?

ఒక్క ట్వీట్ తో పోలీస్ వ్యవస్థ మారిపోతుందా?
ఒక్క ట్వీట్ తో పోలీస్ వ్యవస్థ మారిపోతుందా? 
రేసింగ్ నిర్వాహకుడి పై మంచాల్ ఇన్స్ పెక్టర్  గంగాధర్ దురుసు ప్రవర్తన పై చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ కు తెలంగాణ డీజీపీ ఈ విషయమై మెమో జారీ చేసామనీ, సమాధానం వచ్చిన తర్వాత తగు రీతిలో స్పందిస్తామని సమాధానం ఇచ్చారు. ఇంకా ఇది రేసింగ్ నిర్వాహకుడి మొండితనం వల్లనే జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. దీనికి కేటీఆర్ డీజీపీ కి కృతఙ్ఞతలు కూడా తెలిపారు. ఇది తెలుగు, ఆంగ్ల దినపత్రికలలో ప్రముఖంగా ప్రచురించారు.

అంటే ఒక రాష్ట్ర మంత్రి, అదీ ముఖ్య మంత్రి కుమారుడు చర్యలు తీసుకోవాలని చెప్పినా విచారణ కు ముందే ఇది నిర్వాహకుడి మొండితనం అని పోలీసు బాస్ తేల్చేశారు. ఇక సామాన్య వ్యక్తులు పోలీసుల ప్రవర్తనపై వ్యాఖ్యానించినా, ఫిర్యాదు చయయడానికి వెళ్లినా వారి స్పందన ఎలా ఉంటుందో ఊహించొచ్చు. రేసింగ్ నిర్వాహకుడు చేసింది తప్పే. దానికి చట్టపరంగా ఎలా స్పందించాలో ఆలా స్పందించాలి తప్ప కొట్టడం, అభ్యంతరకర భాష వాడటం, తానే చట్టం అన్నట్లుగా వ్యవరించటం ఏమిటి? . పటిష్టమైన చర్యలు తీసుకోకుండా, ఎదో అప్పుడప్పుడు ఇలా ట్వీట్ చేయటం వాళ్ళ ఆ సంఘటన పై తాత్కాలిక ఉపశమనం తప్ప పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీగా మారిపోతుందా? , పోలీసు ప్రవర్తన ను క్రింద ట్వీట్ లో ఉన్న లింక్ లో వీడియో లో చూడవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత పలు సందర్భాలలో ముఖ్య మంత్రి, మంత్రులు మరియు పోలీస్ అధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. కానీ దీనిపై పటిష్టమైన చర్యలు ఏమీ తీసుకున్నట్టు కనిపించదు. ఇప్పటికీ 90% మంది ప్రజలు పోలీసులంటే భయం, అపనమ్మకం వ్యక్తపరుస్తారు.

మన పోలీసులులో నిజాం/ బ్రిటిష్ కాలం నాటి అహంకారం, దురుసుతనం, అభ్యంతరకరమైన భాష, అవినీతి నరనరాన జీర్ణించుకపోయాయి. ఈ మానసిక జాడ్యాన్ని పోలీస్ జాబ్ లో చేరిన వారు, వారి సీనియర్ల నుండి అలవర్చుకుంటున్నారు. ముందు వీరందరికీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇంకా కఠినమైన చర్యలు, ఇటువంటి సంఘటనలపై పోలీసులతో కాకుండా నిష్పాక్షిక థర్డ్ పార్టీ విచారణ చేయటం, పోలీసుల ప్రవర్తన పై అజమాయిషీ కి చట్టపరమైన వ్యవస్థలుండటం ద్వారా కొంతవరకు దీనిని నియంత్రించవచ్చు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post