ప్రపంచానికి కంప్యూటర్‌ని పరిచయం చేసిందెవరు?

ప్రపంచానికి కంప్యూటర్‌ని పరిచయం చేసిందెవరు?
ప్రపంచానికి కంప్యూటర్‌ని పరిచయం చేసిందెవరు?
10వ తరగతి టెస్ట్ పేపర్ 
సాంఘిక శాస్త్రము - PAPER 1
అ - భాగము
ఈ క్రింది అన్ని ప్రశ్నలకు జవాబు వ్రాయుము. ప్రతి జవాబుకు రెండు మార్కులు. 

1. నాకూ పోలీసులున్నారు. నాకూ ఏసీబీ ఉంది అని గర్జించిన నాయకుడెవరు?
2. ప్రపంచానికి కంప్యూటర్‌ని పరిచయం చేసిందెవరు?
3. కొడుకు కోరికపైన ప్రధాని పదవిని త్యాగం చేసి రాష్ట్ర ప్రయోజనాలకోసం, ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన నాయకుడెవరు?
4. మామను రాజకీయాల్లోకి ఆహ్వానించి తెలుగు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన నాయకుడెవరు?
5. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టిన నాయకుడెవరు?

ఆ - భాగము
ఈ క్రింది వాటిలో ఏవైనా 4 ప్రశ్నలకు జవాబు వ్రాయుము. ప్రతి జవాబుకు పది మార్కులు.

1. రెండు కళ్ల సిద్ధాంతాన్ని, దానిని కనుగొన్న నాయకుడి గురించి వివరించండి. ఈ సిద్ధాంతం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించండి.
2. దే బ్రీఫ్డ్ మీ అని కొండంత అర్థాన్ని సూక్ష్మంగా చెప్పిన నాయకుడి గురించి, ఆ సందర్భం గురించి వివరించండి.
3. మోదీ ఒక మతతత్వవాది. హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తా అని గర్జించిన నాయకుడెవరు? ఏ సందర్భంలో అలా అన్నారు?
4. అనామకులైన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారిని సాఫ్ట్‌వేర్ వైపు ఆకర్షితులను చేసి వారికి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించిన నాయకుడెవరు?
5. రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణ సహకార నిమిత్తం సింగపూర్, జపాన్, చైనాలు పోటీ పడేలా వారిమధ్య వాతావరణం సృష్టించిన మహా నాయకుడెవరు? ఈ నిర్మాణంలో ఆయా దేశాలు ఎటువంటి సహకారం అందించనున్నాయి?
6. ముఖ్యమంత్రి తరచూ సింగపూర్‌ను దర్శించుటకు 10 కారణాలను తెలుపండి.
7. ప్రైవేటుగా అత్యధిక విద్యాసంస్థలు కలిగిన వ్యక్తిని విద్యామంత్రిగా, హాస్పిటళ్లను కలిగిన వ్యక్తిని వైద్యమంత్రిగా చేయుటలో ముఖ్యమంత్రి యొక్క ప్రతిభను, చాణక్యతను వివరించండి.
8. అహం బ్రహ్మాస్మి అన్న సిద్దాంతాన్ని బాగా వంటపట్టించుకొని అన్నీ నేనే అని ఒక ఏఏ సందర్భాలలో నిరూపించారో ఉదాహారణలతో వివరించండి.

(పేస్ బుక్ లో విస్తృతంగా షేర్ అవుతున్న మెసేజ్ ఇది - రచయిత పేరు అక్కడ పేర్కొనబడలేదు)

0/Post a Comment/Comments

Previous Post Next Post