స్వర్ణ గౌరీ నోము

స్వర్ణ గౌరీ నోము
స్వర్ణ గౌరీ నోము
శ్రావణ మాసంలో  స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో వివిధ నోములు నోచుకుంటారు. శుక్ల పక్ష తృతీయ రోజు వివాహిత స్త్రీలు 'స్వర్ణ గౌరీ నోము' జరుపుకుంటారు. ఇది వారి కుటుంబానికి సిరిసంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని భావిస్తారు.  

స్వర్ణ గౌరీ నోమును ఆచరించే స్త్రీలు, తదియ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. పూజా వేదికను  పసుపు కుంకుమలతో అలంకరించి గౌరీదేవి చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. పదహారు ముడులుగల తోరం ధరించి షోడశోపచార పూజ చేయాలి. పదహారు రకాల పూలను, పండ్లను, పిండి వంటలను గౌరీ దేవికి సమర్పించాలి. పూజ  తరువాత కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి. స్వర్ణ గౌరీ వ్రత పూజా విధానము లో షోడశోపచార పూజ కోసం మంగళగౌరి వ్రతంలోని పూజ ను పాటించవచ్చు. ఈ నోమును పదహారు సంవత్సరాల పాటు ఆచరించాలి. 

స్వర్ణ గౌరి వ్రతం లోని కథ ఈ విధంగా ఉంటుంది. పూర్వ కాలంలో  ఒక రాజు వేటకి వెళ్ళిన సందర్భంలో ఓ నదీ తీరాన కొందరు ఏదో పూజ చేస్తున్నట్టుగా కనిపించడంతో  ఏం చేస్తున్నారని వాళ్లని అడుగుతాడు. వారు రాజుకు తాము స్వర్ణగౌరీ నోమును నోచుకుంటున్నట్టుగా చెప్పడంతో వారివద్ద విధి విధానాలు తెలుసుకున్నవాడై  ఇంటికి తిరిగివస్తాడు. రాజు తన ఇద్దరు భార్యలకి ఈ నోము గురించి చెప్పి, ఆచరించ వలసిందిగా కోరతాడు. పెద్ద రాణి ఈ మాటలను పెడచెవిన పెట్టి కష్టాల పాలవుతుంది. చిన్న రాణి పాటించి ఆశించినవి లభిస్తాయి. తర్వాత పెద్ద రాణి కూడా తన తప్పును తెలుసుకుని నోముని ఆచరించి కష్టాల నుండి విముక్తి పొందుతుంది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post