మధు శ్రావణ వ్రతం |
మధు శ్రావణ వ్రతం శ్రావణ మాసములో శుక్లపక్ష తృతీయ రోజు జరుపుకుంటారు. కావున ఈ రోజును మధుశ్రావణ తృతీయ అని కూడా పిలుస్తారు. దీనిని ప్రధానంగా బీహార్, ఉత్తర్ ప్రదేశ్ మరియు మధ్య ప్రదేశ్ ప్రాంతాలలో జరుపుకుంటారు. కొంత మంది తెలుగు వారు కూడా దీనిని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో 13 రోజుల పాటు ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ రోజులని మధుశ్రావణ కాలం అని పిలుస్తారు.
కొత్తగా వివాహం అయిన స్త్రీలు ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతం సందర్భంగా వారు పుట్టింటికి వెళతారు. వారికి కావలసిన ఆహారం మాత్రం మెట్టింటినుండి పంపించబడుతుంది. ఈ సందర్భంగా గౌరీ దేవిని, సూర్య చంద్రులను, గ్రహాలను మరియు నాగ దేవతలను ఆరాధిస్తారు.
Post a Comment