ఉపదేశం |
భారతీయ సాంప్రదాయం లో ఒకరు మరొకరికి ఉపదేశించటం కనిపిస్తుంది. ప్రతి గురువు తన శిష్యునికి ఉపదేశం చేస్తాడు. మన దృష్టిని అనుభవములో ఉన్న ఆత్మ వైపునకు మరలునట్లు చేయటమే ఉపదేశంగా భావిస్తారు.
బ్రహ్మ దేవుడు తన మానస పుత్రుడైన నారదునికి ఉపదేశం గావించాడు. కపిల ముని తన మాతృమూర్తి అయిన దేవహుతికి ఉపదేశం గావించాడు. శివుడు తన భార్య అయిన పార్వతికి ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు తన మిత్రుడైన అర్జునునికి ఉపదేశించాడు. ఇలా ఉపదేశమనేది గురువు నుండి శిష్యునికే గాక ఏ ఇద్దరి మధ్యనైనా ఉండవచ్చు. శ్రద్ధగా వినేవాడున్న సందర్భంలో ఇష్టంతో చెప్పబడేది ఏదైనా ఉపదేశమే అవుతుంది.
Post a Comment