రేవంత్ కి అదో తుత్తి

రేవంత్ అదో తుత్తి
రేవంత్ కి అదో తుత్తి
మనం నాశనమైనా పరవాలేదు, మన పక్కవాడు మాత్రం బాగుపడకూడదు, ఇదేరా మన ఇండియన్ మెంటాలిటీ అని ఒక సినిమా లో పోసాని కృష్ణ మురళి తన పక్కనున్న వాడితో అంటాడు. ఇది మిగిలిన వారి విషయంలో ఏమో గానీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం నిజమే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టిఆర్ఎస్‌లోకి వలసలు వెలుతుండటం పై ఈయన హర్షం వ్యక్తం చేయటం మాత్రం ఖచ్చితంగా ఈ కోవలోకే వస్తుంది. 

తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లోకి వెళ్ళినప్పుడు తాను స్వయంగా కోరినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ కనీసం స్పందించలేదని పేర్కొంటూ ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వెళుతుంటే మాత్రం తెగ బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ అసెంబ్లీలో  చిన్న కారణానికే తమ 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినప్పుడు కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదని, అందుకే వారికీ గతి పట్టిందనీ గతాన్ని గుర్తుచేసి మరీ వారికి ఇలాగే జరగాలని కూడా అన్నారు. త్వరలో  బీజేపీకి కూడా ఇదే పరిస్థితి వస్తుందని రేవంత్ జోస్యం చెప్పారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post