జుకర్ బర్గ్ షేర్ చేసిన చిన్ననాటి ఫోటో

జుకర్ బర్గ్ షేర్ చేసిన చిన్ననాటి ఫోటో
జుకర్ బర్గ్ షేర్ చేసిన చిన్ననాటి ఫోటో 
ఫేస్ బుక్ ఫౌండర్ మరియు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్  ఏప్రిల్ 10వ తేదీన వరల్డ్ సిబ్లింగ్ డే ను పురస్కరించుకుని అరుదైన ఫొటోను పోస్ట్ చేశారు. తన సోదరీమణులు అరెల్లె, డొన్నా, రాండీ లకు  సిబ్లింగ్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తమ చిన్ననాటి ఫోటోను పేస్ బుక్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఒంటె ఆకారంలో ఉన్న ఒక చెక్క పై జుకర్ బర్గ్ తన ముగ్గురు అక్కా చెల్లెళ్ళతో కలిసి కూర్చుని ఉన్నారు. అద్భుతమైన సోదరీమణులకు అభినందనలు అంటూ పోస్ట్ చేసారు. 1980లలో  స్కై  జాకెట్లతో చాలా బాగా గడిచిన తమ బాల్యాన్ని, అప్పటి  మధురమైన క్షణాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఈ ఫోటో పై నెటిజన్ల నుండి కామెంట్లు వెల్లువెత్తాయి. జుకర్ బర్గ్ మొహం లో పెద్దగా తేడా ఏమీ రాలేదనీ, అతని కళ్లల్లో  భవిష్యత్తు మెరుపు  స్పష్టంగా  కనిపిస్తోందన్నారు. ఆయన ఈ మద్య తండ్రి అయినప్పటి నుండి తన చిన్నారి ఫోటోలను కూడా ఎక్కువగా షేర్ చేస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post