కేశవరెడ్డి నిర్వహణ ఇక చైతన్య విద్యాసంస్థలకు |
ఇక కేశవరెడ్డి విద్యా సంస్థలు స్కూల్స్, చైతన్య విద్యా సంస్థల గొడుగు కిందకు రానున్నాయి. కేశవ రెడ్డి సంస్థల యజమాని నాగిరెడ్డి కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి డిపాజిట్ల పేరుతో భారీ మొత్తాలను వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై ఆయన అరెస్ట్ అయ్యారు.
కేవలం విద్యాసంస్థల అకడమిక్ కార్యకలాపాలను మాత్రమే శ్రీచైతన్య పర్యవేక్షిస్తుందని, ఖాతాలు, ఫీజుల విషయంలో శ్రీచైతన్య విద్యాసంస్థల జోక్యం ఉండదని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం స్పష్టం చేసింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
Post a Comment