కాల్పులతో విద్యుత్ తీగలు తెగి 11 మంది మృతి |
పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడం వల్ల విద్యుత్ తీగలు తెగి జనం పై పడ్డాయి. ఇవి హై వోల్టేజ్ తీగలు కావటం తో 11 మంది మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణమైన ఘటన అస్సాం లోని టిన్‌సుకియా జిల్లా పన్‌గిరిలో జరిగింది. గాయపడ్డవారిని వీరిని టిన్‌సుకియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మూడు రోజుల కిందట పన్‌గిరిలో జరిగిన గొడవలలో ఇద్దరు వ్యక్తులు హత్య చేయబడ్డారు. ఈ కేసులో కొందరిని పోలీసులు అరెస్టు చేయటంతో, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని భారీ సంఖ్యలో ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ వద్ద జమయ్యారు. వీరు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఒక దశలో అదుపు తప్పి పోలీసు స్టేషన్‌పైకి రాళ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో హై వోల్టేజీ విద్యుత్ తీగలు తెగి ఆందోళన చేస్తున్న జనాలపై పడ్డాయి.
Post a Comment