ఇండియా లో మరో వ్యాక్స్ మ్యూజియం |
లండన్ లోని మాడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం తరహాలో రాజస్థాన్‌లోని నహర్‌గఢ్ కోటలో కూడా వ్యాక్స్ మ్యూజియం కొలువు తీరనుంది. ఈ కోటలో త్వరలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల మైనపు, సిలికాన్ విగ్రహాలు ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇక్కడ నటులు, క్రీడలు, చరిత్ర, సంగీతం, సాహిత్యం లో ప్రసిద్ధ వ్యక్తుల తో పాటు సాంస్కృతిక చిహ్నాల ప్రతిమలు ఏర్పాటు కానున్నాయి.
రాజస్థాన్ పురావస్తు శాఖ పర్యాటకులను ఆకట్టుకునేందుకు వ్యాక్స్ మ్యూజియం ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇక్కడ సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇండియా లో పుణె సమీపంలోని లోనావాలలో కూడా వ్యాక్స్ మ్యూజియం ఉంది.

Post a Comment