![]() |
కల్తీమద్యానికి తొమ్మిది మంది బలి |
రాజస్థాన్‌లోని బార్మర్ ప్రాంతంలో కల్తీమద్యం తాగి తొమ్మిది మంది మరణించారు. చనిపోయిన వారిలో ఇద్దరు BSF జవాన్లు ఉండటం తో ఈ దుర్ఘటన మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల ప్రకారం, సోమవారం రోజు బార్మర్ ప్రాంతంలో కల్తీ మద్యం తాగి 29 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం బార్మర్, జోధ్‌పూర్ ఆస్పత్రులకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఇప్పటివరకు 9 మంది మరణించారు. ఇంకా మిగిలిన 20 మందిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం మృతి చెందిన వారి కుటుంబాలకు 75000 రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అంతేకాక కల్తీ మద్యం పైన కఠినంగా వ్యవరిస్తామని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన కల్తీ మద్యం తయారీకేంద్రాన్ని జింజిన్యాలీ గ్రామంలో గుర్తించి ఏడు డ్రమ్ముల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు ఎక్సైజ్ అధికారులతో పాటు ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసామని ప్రకటనలో తెలిపింది .

Post a Comment