చిత్తూరు జిల్లా కోర్టులో బాంబు పేలుడు |
చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ పేలుడులో ఒక కారు ధ్వంసం కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పార్క్ చేసి ఉంచిన స్కూటర్ డిక్కీలో ఈ బాంబు ఉంచినట్లు అనుమానిస్తున్నారు. ఆరు నెలల క్రితం జరిగిన చిత్తూరు మేయర్ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూను కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో పేలుడు జరిగింది. అతన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు బాంబు పేల్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒక బాంబు పేలగా, మరొకదాన్ని పోలీసులు నిర్వీర్యం చేసారు.
Post a Comment