ఫోక్స్‌వేగన్ వెంటో అమ్మకాలు నిలిపివేత |
ఇండియా లో ఫోక్స్‌వేగన్, వెంటో (Volkswagen, Vento) డీజిల్ కారు అమ్మకాల్ని తాత్కాలికంగా ఆపివేసింది. అలాగే ఇప్పటికే వినియోగదారులకు అందజేసిన మరో 3877 వెంటో డీజిల్ కార్లని సైతం వెనక్కి తీసుకోనుంది.
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కారు నిబంధనలు అనుమతించిన దాని కన్నా ఎక్కువ మోతాదులో కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు విడుదల చేస్తుంది. మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న 1.5 లీటర్ డీజిల్ వాహనాలలో ఈ సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించే వరకు అమ్మకాల్ని ఆపిస్తున్నట్టు ఫోక్స్‌వేగన్ ఇండియా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Post a Comment