ప్రముఖ టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్య |
ప్రముఖ టీవీ నటి, చిన్నారి పెళ్లికూతురు (హిందీలో బాలికా వధు) సీరియల్ లో ఆనందిగా నటించి పేరు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ ముంబయిలోని తన స్వగృహంలో ఉరివేసుకొన్నారు. ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వయసు 24 సంవత్సరాలు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌తో గత కొంతకాలంగా గొడవలున్నట్లు సమాచారం. చనిపోయే ముందు వాట్స్ ఆప్ లో తన బాయ్ ఫ్రెండ్ కు చనిపోయినా నీతోనే ఉంటాను అనే మెసేజ్ చేసింది.
ప్రత్యూష స్వరాష్ట్రం ఝార్ఖండ్. ఈవిడ బిగ్ బాస్-7, ఝలక్ దిఖ్‌లా జా-5 వంటి రియాలిటీషోల్లోనూ పాల్గొన్నారు. ఆమె చివరిగా చేసిన టీవీ షో హమ్ హై నా. ప్రత్యూష స్నేహితులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనీ, ఆమె శరీరం పైన గాయాలున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment