సింగరేణి సంస్థకు రికార్డు లాభం

సింగరేణి సంస్థకు రికార్డు లాభం
సింగరేణి సంస్థకు రికార్డు లాభం
సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 2015-16 ఆర్ధిక సంవత్సరానికి గాను 1,020 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించగలిగింది.  ఇది సింగరేణి చరిత్ర లోనే ఒక రికార్డు. గత సంవత్సరం (2014-15) లో ఈ లాభం 490 కోట్లు మాత్రమే. ఈ సంవత్సరం టర్నోవర్ కూడా 17.3% పెరిగి 14,078 కోట్ల నుండి 16,516 కోట్ల కు చేరింది.

బొగ్గు ఉత్పత్తి కూడా రికార్డు స్థాయి లో 60.43 మిలియన్ టన్నులుగా నమోదయింది. గత సంవత్సరం (52.54 మిలియన్ టన్నులు) తో పోలిస్తే ఇది 15% ఎక్కువ. బొగ్గు రవాణాలో కూడా 11.5% వృద్ది తో 58.5 మిలియన్ టన్నులకు చేరుకోగలిగింది. ఈ సంవత్సరం 4,651 కోట్ల రూపాయల పన్నులను ప్రభుత్వానికి చెల్లించింది. 2019- 20 కల్లా 100 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యం గా నిర్దేశించుకుంది.

ఇండియా లో 15% వృద్దిని సాధించిన ప్రభుత్వ రంగ సంస్థ ఇది ఒక్కటే. ఈ సంస్థ ఆదిలాబాద్ జిల్లా లోని జైపూర్ లో 600 మెగా వాట్ల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది. మే నెలలో రెండవ 600 మెగావాట్ల యూనిట్ కూడా ఉత్పత్తిని ప్రారంభించనుంది. వచ్చే సంవత్సరం నుండి ఈ ఆదాయం కూడా సంస్థ కు జత కానుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post