వర్మ ఇక ట్వీట్ చెయ్యడట

వర్మ ఇక ట్వీట్ చెయ్యడట
వర్మ ఇక ట్వీట్ చెయ్యడట
తనకు పవన్‌కళ్యాణ్ అన్నా, ఆయన అభిమానులన్నా ఇష్టమంటూ ట్విట్టర్‌ వేధికగా తరచూ ప్రస్తావించే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తాజాగా ఓ సంచలన నిర్ణయాన్ని ట్వీట్‌ ద్వారా తెలియజేసాడు. తాను మంచి ఉద్దేశంతోనే ట్వీట్ చేస్తున్నా, అందరూ అపార్థం చేసుకుంటున్నారని, ఇకపై తన జీవితంలో పవన్‌కల్యాణ్‌ పై ఎప్పుడూ ఎటువంటి ట్వీట్‌ చేయనని పేర్కొన్నారు. చివరిసారి బై.. బై పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

ఎప్పుడూ  అభిమానులకు ట్విట్టర్ ద్వారా అందుబాటులో ఉండే రాంగోపాల్ వర్మ ట్వీట్లు సామాన్యంగా చేస్తున్నాడో, వ్యగ్యంగా చేస్తున్నాడో, అర్థం కాకుండా ఉంటాయి. వివాదాలను ఇష్టపడుతున్నట్లు అనిపించే వర్మ, ఈ మద్య మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేసినట్లనిపించే ట్వీట్లు చేయటంతో అభిమానులు విరుచుకపడ్డారు.

0/Post a Comment/Comments