పవన్ కళ్యాణ్‌ను నిద్రలేపాల్సిన బాధ్యత మీదే

పవన్ కళ్యాణ్‌ను నిద్రలేపాల్సిన బాధ్యత మీదే
పవన్ కళ్యాణ్‌ను నిద్రలేపాల్సిన బాధ్యత మీదే
ఈ మద్య మెగా ఫ్యామిలీ పైన వరుసగా విమర్శలు చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్‌ పైన విమర్శలు చేసారు. నిన్న పవన్ మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన ట్విట్టర్ లో విరుచుక పడ్డారు.

ఒక ట్వీట్ లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏ మాత్రం కలెక్షన్లు సాధించటం లేదని, ఇంగ్లీషు నుంచి డబ్బింగ్ అయిన సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయనను నిద్ర లేపాల్సిన బాధ్యత పీకే అభిమానుల మీద ఉందని పేర్కొన్నారు.

ఇంకో ట్వీట్ లో అయితే  జంగిల్ బుక్ సినిమాలో నటించిన నటుడి ఫొటో ఒకటి పోస్ట్ చేసి, సర్దార్ గబ్బర్‌సింగ్‌తో పాటు రాజా సర్దార్ గబ్బర్‌సింగ్‌ను కూడా చంపేసిన చిన్న పిల్లాడిని చూడండి. అని అన్నారు.

పవన్ కళ్యాణ్ కూడా రాంగోపాల్ వర్మ మీద కొంచం సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ మాట్లాడుతూ వర్మ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన బయటవాళ్ల మీద పెట్టే శ్రద్ధ లో కొంచం తనపై, తన సినిమాలపై పెడితే ఎక్కడికో వెళ్లేవారని పవన్ అన్నారు. అవసరమైతే తాను కూడా ఆయనలా మాట్లాడగలనని హెచ్చరించారు.

0/Post a Comment/Comments