అనంత్ అంబానీకి ప్రశంసలు

అనంత్ అంబానీ తో సచిన్
అనంత్ అంబానీ తో సచిన్
100 కేజీలకు పైగా బరువు తగ్గిన  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని కూడా ఈ లిస్టు లో చేరాడు. ఇంత బరువు తగ్గాలంటే ఎంతో క్రమశిక్షణ, అంకితభావంతో శ్రమించాలని, అందుకు అతడిని అభినందిస్తున్నానని పేర్కొన్నాడు. అలాగే ట్విట్టర్ ద్వారా అనంత్ అంబానీకి బర్త్ డే విషెస్ కూడా తెలిపాడు. బరువు తగ్గించుకుని తనకు తానే అనంత్ పుట్టినరోజు కానుక ఇచ్చుకున్నాడని వ్యాఖ్యానించాడు. అతడితో దిగిన ఫొటోను కూడా ట్విటర్ లో పోస్టు చేశాడు.

18 నెలల్లో అనంత్ 108 కిలోల బరువు తగ్గాడు. రోజుకు ఐదారుగంటల వ్యాయామం, 21 కిలోమీటర్లు వాకింగ్, డైటింగ్ తో అతడు ఎటువంటి కాస్మెటిక్ సర్జరీలు లేకుండానే సన్నబడ్డాడు. శనివారం రోజు ముంబై ఇండియన్స్, పుణే మ్యాచ్ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తో కూడా ఫొటో దిగాడు. అది కూడా సోషల్ మీడియా లో విస్తృతంగా షేర్ అవుతుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post