ఎవరి భార్య ఎవరో తెలియట్లేదు

ఎవరి భార్య ఎవరో తెలియట్లేదు
ఎవరి భార్య ఎవరో తెలియట్లేదు
చైనాలోని షాంజీ ప్రాంతానికి చెందిన ఐడెంటికల్ ట్విన్ సిస్టర్స్ యున్ ఫియ్, యున్ యాంగ్  వారి ఊరికి సమీపంలోని మరో ఉళ్లోని ఐడెంటికల్ ట్విన్ బ్రదర్స్ ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. గత ఫిబ్రవరి 15న వీరి వివాహం జరిగింది.

అయితే పెళ్లి అయిన తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయట. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఎవరనేది గుర్తించలేకపొతున్నారట. తెలిసిన వారు, స్నేహితులు సైతం ఒకరితో మాట్లాడాల్సింది మరొకరితో మాట్లాడుతున్నారట. ఒక్కొక్కసారి వాళ్ళలో వాళ్ళకే అర్థం కావటం లేదట. ఆ జంటలు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించి వారి రూపాలనే మార్చుకోవాలనుకున్నారు. వీరిని పరీక్షించిన వైద్యులు ముఖంలో చిన్న చిన్న మార్పులు చేసి పరిష్కరిస్తామన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post