నా జీవితంలో అది దుర్దినం

నా జీవితంలో అది దుర్దినం
నా జీవితంలో అది దుర్దినం
T20  వరల్డ్ కప్ లో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ తన వల్లే వరల్డ్ కప్ చేజారిపోయిందని  పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సిన దశలో తన బౌలింగ్ లో నాలుగు సిక్సర్లు సమర్పించుకోవటంతో తాను షాక్ కు గురైనట్లు స్టోక్స్ తెలిపాడు. తాను ఇంకా షాక్ నుండి తేరుకోలేదని, తన జీవితంలో మర్చిపోదగ్గ దుర్దినం ఏదైనా ఉంటే ఇది అదేనని ఆతను పేర్కొన్నాడు.

మేము రన్నరప్ గా నిలవడాన్ని నేను సరిపెట్టుకోలేను. అంతా నా వల్లే జరిగింది. ఆఖరి ఓవర్లో బ్రాత్ వైట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇందుకు పూర్తి బాధ్యత తనదేనని దీన్నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా స్టోక్స్ చెప్పాడు.

0/Post a Comment/Comments